‘దివ్యాంగుల పింఛన్ల తొలగింపు అన్యాయం’
eenadu telugu news
Published : 21/09/2021 01:37 IST

‘దివ్యాంగుల పింఛన్ల తొలగింపు అన్యాయం’


జర్నలిస్టు సంఘ నేతలకు చెక్కు అందజేస్తున్న నరేంద్రవర్మరాజు

బాపట్ల, న్యూస్‌టుడే : రాష్ట్రవ్యాప్తంగా 2.26 లక్షల పింఛన్లను వైకాపా ప్రభుత్వం తొలగించటం దారుణమని తెదేపా నియోజకవర్గ బాధ్యుడు వేగేశన నరేంద్రవర్మరాజు అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వేగేశన మాట్లాడుతూ దివ్యాంగుల పింఛన్లు రద్దు చేయటం అన్యాయమని పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలనలో విభిన్న ప్రతిభావంతులకు పింఛన్లు మినహా ఎలాంటి సంక్షేమ, ఉపాధి పథకాలు అమలు చేయలేదన్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో దివ్యాంగులకు 2500 మోటార్‌ సైకిళ్లు పంపిణీ చేశామని చెప్పారు. వైకాపా బలవంతంగా ఏకగ్రీవాలు చేయిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నందునే అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు పరిషత్‌ ఎన్నికలను తెదేపా బహిష్కరించిందన్నారు. తెదేపా పోటీలో లేని ఎన్నికల్లో గెలిచి అదంతా తమ బలమని ఉప సభాపతి కోన రఘుపతి చెప్పడం సరికాదన్నారు. తెదేపా దివ్యాంగుల విభాగం రాష్ట్ర నేత నీలం జోషిబాబు, తెదేపా పట్టణాధ్యక్షుడు వడ్లమూడి వెంకటేశ్వరరావు, నేతలు రామారావు, గుర్రన్న, గోపి, బాలు, కార్తీక్‌ పాల్గొన్నారు. 

జర్నలిస్టుల సంక్షేమానికి రూ.5 లక్షల విరాళం
బాపట్ల జర్నలిస్టుల సంక్షేమానికి తెదేపా నియోజకవర్గ బాధ్యుడు వేగేశన నరేంద్రవర్మరాజు రూ.5 లక్షల విరాళం అందజేశారు. పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో బాపట్ల జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు వేజెండ్ల శ్రీనివాసరావు, కార్యదర్శి బుర్రా ఆంజనేయులుకు విరాళం చెక్కును వేగేశన అందజేశారు. నరేంద్రవర్మ మాట్లాడుతూ కరోనా సమయంలో జర్నలిస్టులు తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొన్నారని, వారి సంక్షేమానికి తన వంతుగా విరాళం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని