వినియోగదారుల అభిరుచుల మేరకే ‘సంగం’ ఉత్పత్తులు
eenadu telugu news
Published : 17/10/2021 02:09 IST

వినియోగదారుల అభిరుచుల మేరకే ‘సంగం’ ఉత్పత్తులు


డెయిరీ నూతన ఉత్పత్తులను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్న ఛైర్మన్‌ నరేంద్రకుమార్‌

పొన్నూరు, న్యూస్‌టుడే: వినియోగదారుల అభిరుచుల మేరకు సంగం డెయిరీ ఉత్పత్తులను తయారు చేసి అందజేస్తున్నామని ఆ డెయిరీ ఛైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం వడ్లమూడి వద్దనున్న సంగం డెయిరీ ఆవరణలో ఆయన సంస్థ పాలకమండలి సభ్యులు, అధికారుల చేతుల మీదుగా ఉస్మానియా బిస్కెట్స్‌, ప్లమ్‌ కేక్‌, బార్‌ కేక్‌, హై అరోమా నెయ్యి, రిచ్‌ అరోమా నెయ్యి, ఆవు నెయ్యిలను మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ ఆదాయం గల సామాన్య కుటుంబాలకు నెయ్యి అందుబాటులో ఉండేలా 15, 30, 50 గ్రాముల నెయ్యి ప్యాకెట్లను మార్కెట్‌లోకి విడుదల చేశామన్నారు. కార్యక్రమంలో సంస్థ ఎండీ గోపాలకృష్ణన్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని