గంజాయి విక్రయ ముఠా అరెస్టు
eenadu telugu news
Published : 17/10/2021 02:15 IST

గంజాయి విక్రయ ముఠా అరెస్టు

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : గంజాయి విక్రయిస్తున్న  ముగ్గురు సభ్యుల ముఠాను స్పెషల్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ బ్యూరో (సెబ్‌) పోలీసులు అరెస్టు చేశారు. వారిలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి ఉన్నారు. గుంటూరు సెబ్‌-2 పోలీసుస్టేషన్‌లో శనివారం సెబ్‌ జాయింట్‌ డెరెక్టర్‌ బిందుమాధవ్‌ నిందితుల వివరాలను తెలిపారు. రాజీవ్‌గాంధీనగర్‌కు చెందిన ప్రదీప్‌తోపాటు అదే ప్రాంతానికి చెందిన డిగ్రీ విద్యార్థి, షాపు ఎంప్లాయీస్‌ కాలనీకి చెందిన మహేష్‌కుమార్‌లు స్నేహితులు. మత్తుకు బానిసై గంజాయి తాగడంతోపాటు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు అమరావతి రోడ్డులో సంచరిస్తున్నారనే సమాచారంతో ఈఎస్‌ అన్నపూర్ణ, ఏఈఎస్‌ మణికంఠ ఆధ్వర్యంలో సీఐ కర్ణ, ఎస్సై షరీఫ్‌లు తమ సిబ్బందితో వెళ్లి నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి నుంచి రూ.3.35 లక్షల విలువ చేసే ద్రవ రూపంలోని 900 గ్రాముల గంజాయి డబ్బాలను జప్తు చేసినట్లు చెప్పారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని