బాణసంచా విక్రయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి
eenadu telugu news
Published : 21/10/2021 03:32 IST

బాణసంచా విక్రయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి


సమావేశంలో మాట్లాడుతున్న జేసీ దినేష్‌కుమార్‌

కలెక్టరేట్‌ (గుంటూరు), న్యూస్‌టుడే: దీపావళి పండగ నేపథ్యంలో బాణసంచా విక్రయాలు జరిగే ప్రాంతాల్లో అగ్నిప్రమాదాల నివారణకు అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా సంయుక్త కలెక్టర్‌(రైతుభరోసా, రెవెన్యూ) ఏఎస్‌ దినేష్‌కుమార్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని ఎస్‌.ఆర్‌.శంకరన్‌ హాలులో బాణసంచా విక్రయ దుకాణాల ఏర్పాటు అనుమతులపై రెవెన్యూ, మున్సిపల్‌, పోలీస్‌, అగ్నిమాపక శాఖల అధికారులతో బుధవారం సమావేశమయ్యారు. జేసీ దినేష్‌కుమార్‌ మాట్లాడుతూ దీపావళి బాణసంచా తాత్కాలిక దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా శాఖ ద్వారా ఎన్‌వోసీలు తీసుకుని ఆర్‌డీవోల నుంచి అనుమతులు పొందాలన్నారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్లు ఉన్న వారికి మాత్రమే అనుమతులు మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. పర్యావరణానికి హాని కలగని గ్రీన్‌ క్రాకర్స్‌ మాత్రమే విక్రయించాలని సూచించారు. డీఆర్‌వో పి.కొండయ్య మాట్లాడుతూ దీపావళి టపాసుల తాత్కాలిక దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తులను ఈనెల 28వ తేదీ లోగా ఆర్డీవో కార్యాలయాల్లో అందించాలన్నారు. సమావేశంలో అగ్నిమాపకశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి, తెనాలి సబ్‌ కలెక్టర్‌ డాక్టర్‌ నిధిమీనా, ఏఎస్పీ గంగాధర్‌, ఆర్డీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, బాణసంచా దుకాణాల నిర్వాహకులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని