రిజిస్ట్రేషన్‌ ధరలపైకలెక్టర్‌ సమీక్ష
eenadu telugu news
Published : 22/10/2021 05:24 IST

రిజిస్ట్రేషన్‌ ధరలపైకలెక్టర్‌ సమీక్ష

ఈనాడు, అమరావతి: జిల్లాలో ఎక్కడైనా రిజిస్ట్రేషన్‌ ధరలు బహిరంగ మార్కెట్లో కన్నా ఎక్కువగా ఉన్నా.. ప్రభుత్వ ధరలు బాగా తక్కువగా ఉన్నా వాటిని సవరించుకోవడంపై యంత్రాంగం దృష్టి సారించాలని జిల్లా పాలనాధికారి వివేక్‌ యాదవ్‌ జిల్లా రిజిస్ట్రేషన్‌ అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రేషన్‌ లావాదేవీలు లక్ష్యం మేరకు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. గురువారం సాయంత్రం కలెక్టర్‌ ఛాంబర్‌లో గుంటూరు, తెనాలి, నరసరావుపేట జిల్లా రిజిస్ట్రార్లతో పాటు పలువురు సబ్‌ రిజిస్ట్రార్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బాపట్ల, నరసరావుపేట ప్రాంతాల్లో కొంచెం ధరలు తక్కువగా ఉన్నాయని సంబంధిత జిల్లా రిజిస్ట్రేషన్‌ అధికారులు కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఎక్కడైతే తక్కువగా ఉన్నాయో వాటి సర్వే నంబర్లతో ప్రతిపాదనలు పంపితే వాటిపై ఆర్డీఓ, తహసీల్దార్‌, సబ్‌రిజిస్ట్రార్లతో విచారించి పెరుగుదలపై నిర్ణయం తీసుకుందామని అధికారులతో అన్నట్లు తెలిసింది. గుంటూరు పరిధిలోనూ కొన్ని ప్రాంతాల్లో ధరలు పెంచి, కొన్నిచోట్ల తగ్గించాలనే అభిప్రాయం వ్యక్తమైంది. దీనికి సంబంధించి శుక్రవారం గుంటూరు పరిధిలోని సబ్‌రిజిస్ట్రార్ల నుంచి పెంపుదల, తగ్గుదల ప్రతిపాదనలు తీసుకుని అనంతరం కలెక్టర్‌కు పంపుతామని రిజిస్ట్రేషన్‌ అధికారి ఒకరు చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని