Published : 25/01/2021 02:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

క్రేన్‌ ఢీకొని ఆరేళ్ల పాప మృతి

నందిగామ: క్రేన్‌ ఢీకొని ఆరేళ్ల పాప మృతిచెందిన సంఘటన నందిగామ మండలం పారిశ్రామికవాడ జంగోనిగూడ రోడ్డులో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, ఎస్‌ఐ ధనుంజయ్‌ వివరాల ప్రకారం.. బిహార్‌కి చెందిన కమలేష్‌ కుటుంబ సభ్యులతో కలిసి కొన్నేళ్ల క్రితం వలస వచ్చాడు. స్థానికంగా ఓ పత్తి పరిశ్రమలో పనిచేస్తూ.. పారిశ్రామికవాడ కాలనీలో అద్దెకు నివాసముంటున్నాడు. ఈ నేపధ్యంలో ఖుషి(6) ఇంటి సమీపంలోని జంగోనిగూడ వెళ్లే రహదారి పక్కన నిలబడింది. పాత జాతీయ రహదారి నుంచి అజాగ్రత్తతో వస్తున్న క్రేన్‌ డ్రైవర్‌ బాలగోవింద్‌.. క్రేన్‌తో ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో పాప అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని షాద్‌నగర్‌ తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని