
సమస్యలపై ప్రజా గొంతుకనవుతా
మాట్లాడుతున్న ప్రొఫెసర్ నాగేశ్వర్
వికారాబాద్ మున్సిపాలిటీ, న్యూస్టుడే: వికారాబాద్ జిల్లా సమస్యలపై శాసన మండలిలో ప్రజా గొంతుకనై సమస్యలను ప్రశ్నిస్తానని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల పట్టభద్రులు ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ అన్నారు. బుధవారం స్థానిక క్లబ్ ఫంక్షన్ హాల్లో పట్టభద్రులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయులతో నిర్వహించిన ‘ముఖాముఖి’ కార్యక్రమంలో ఆయన పాల్గొని డబ్బుతో ఓటర్లను కొనలేరని పేర్కొన్నారు. మొదటి ప్రాధాన్యం ఓటు తనకే వేయాలని కోరారు. టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెంకటరత్నం పాల్గొన్నారు.
Tags :