800 కంపెనీలు తాత్కాలికంగా మూత
logo
Published : 12/05/2021 03:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

800 కంపెనీలు తాత్కాలికంగా మూత

చర్లపల్లి, న్యూస్‌టుడే: లాక్‌డౌన్‌ నేపథ్యంలో చర్లపల్లి పారిశ్రామికవాడలో వివిధ కంపెనీలు 10 రోజులపాటు మూతపడనున్నాయి. ఈ పారిశ్రామికవాడ వెయ్యికి పైగా సూక్ష్మ చిన్న మధ్యతరహా కంపెనీలతో విస్తరించి ఉంది. వేలాది మంది వలసకార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఆహారం, ఫార్మా, నిత్యావసర సరకుల ప్యాకింగ్‌ పరిశ్రమలు మాత్రమే ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు నడుచుకుంటామని టీఎస్‌ఐఐసీ కమిషనర్‌ విజయ తెలిపారు. సుమారు 800 కంపెనీలు తాత్కాలికంగా మూతపడతాయని, ఐదువేల మంది వలసకార్మికులకు ఈ 10 రోజులు వేతనంతో కూడిన సెలవులను మంజూరు చేయాలని యాజమాన్యాలకు నోటీసులు పంపుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని