మొక్కలు నాటేందుకు స్థలాలు గుర్తించండి
logo
Published : 19/06/2021 00:47 IST

మొక్కలు నాటేందుకు స్థలాలు గుర్తించండి

పరిశీలిస్తున్న అదనపు పాలనాధికారి చంద్రయ్య

కొడంగల్‌, న్యూస్‌టుడే: హరితహారం కార్యక్రమానికి అన్ని నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉంచాలని అదనపు పాలనాధికారి చంద్రయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని పలు నర్సరీలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. మొక్కలు నాటేందుకు ముందుగానే స్థలాలు గుర్తించి గుంతలు తీసి ఉంచాలన్నారు. పంపిణీ చేసిన ప్రతి మొక్కను సంరక్షించుకునేలా సూచనలు, సలహాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్యాలమద్ది గ్రామంలో శ్మశాన వాటిక పనులు ఎందుకు ప్రారంభించలేదని సర్పంచిని ప్రశ్నించగా.. మూడు రోజుల క్రితమే స్థలం కేటాయించారని, పనులు ప్రారంభిస్తామని తెలిపారు. పలు గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు విధులకు సరిగ్గా హాజరు కావడంలేదని పలువురు ఆయన దృష్టికి తీసుకురాగా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కార్యదర్శులను హెచ్చరించారు. ఎంపీడీవో మోహన్‌లాల్‌, ఏపీవోలు రాములు, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

యాలాల: నర్సరీల్లో పెరుగుతున్న మొక్కలను నాటేందుకు గుంతలు తవ్వాలని డీఆర్‌డీఓ కృష్ణన్‌ సిబ్బందికి సూచించారు. శుక్రవారం మండలంలోని పగిడియాల్‌, అన్నాసాగర్‌ గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీలను ఆయన సందర్శించారు. హరితహారం కార్యక్రమం వరకు ఈ ప్రక్రియ పూర్తికావాలన్నారు. అన్నాసాగర్‌లో పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి ఎంపీడీఓ మహేష్‌కుమార్‌, సూపర్‌వైజర్‌ శ్రావణ్‌కుమార్‌, సర్పంచి బసిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి వీరన్న, క్షేత్రసహాయకులు ఉదయ్‌, రమేష్‌ తదితరులు ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని