పొలంలో కూలీ మృత్యువాత
eenadu telugu news
Published : 27/07/2021 02:23 IST

పొలంలో కూలీ మృత్యువాత

 

చేర్యాల, న్యూస్‌టుడే: వ్యవసాయ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు పొలంలో పడిపోయి ఓ కూలీ మృతి చెందిన సంఘటన చేర్యాల మండలంలోని ఆకునూరులో జరిగింది. గ్రామానికి చెందిన జక్కు సంపత్‌ (33) ఉపాధి కోసం వ్యవసాయ పనులు చేస్తుంటాడు. ఓ రైతు పొలంలో పని చేయడానికి సోమవారం వెళ్లాడు. పని చేస్తుండగా పొలంలో పడిపోయి ఊపిరి ఆడక మృతి చెందాడు. కొన్నాళ్లుగా మూర్ఛ వ్యాధితో బాధ పడుతున్నాడని గ్రామస్థులు చెప్పారు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ విషయమై ఎస్సై రాకేశ్‌ మాట్లాడుతూ తమకు ఫిర్యాదు రాలేదని తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని