బస్సు సేవలు పునరుద్ధరించాలని ధర్నా
eenadu telugu news
Published : 01/08/2021 00:59 IST

బస్సు సేవలు పునరుద్ధరించాలని ధర్నా


ధర్నా చేస్తున్న యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు

దౌల్తాబాద్‌, న్యూస్‌టుడే: మండలకేంద్రం నుంచి గ్రామాలకు బస్సు సేవలను పునరుద్ధరించాలని యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు రెడ్డి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. శనివారం బాలంపేట గేట్‌ సమీపంలో ధర్నా చేపట్టారు. కరోనా కాలం నుంచి గ్రామాలకు బస్సు సేవలు నిలిపివేశారు. మండల కేంద్రం మీదుగా బాలంపేట; సుల్తాన్‌పూర్‌-నారాయణపేట, కొడంగల్‌-నందారం, మండలకేంద్రం నుంచి తిమ్మాయిపల్లి మీదుగా బిచ్చాల్‌, కొడంగల్‌ వరకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోందని వాపోతున్నారు. భాజపా కిసాన్‌ మోర్చ రాష్ట్ర నాయకులు వెంకటయ్య, యువజన కాంగ్రెస్‌ నాయకులు తదితరులున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని