హుస్సేన్‌ సాగర్‌లో సైలింగ్‌ శిక్షణ పోటీలు
eenadu telugu news
Published : 02/08/2021 01:58 IST

హుస్సేన్‌ సాగర్‌లో సైలింగ్‌ శిక్షణ పోటీలు

కోచింగ్‌ పోటీల ప్రారంభోత్సవంలో లఫె్ట్‌నెంట్‌ జనరల్‌ టీఎస్‌ఏ నారాయణన్‌

బన్సీలాల్‌పేట, న్యూస్‌టుడే: హుస్సేన్‌ సాగర్‌లో 11 రోజుల పాటు అబ్బురపరిచే విన్యాసాలతో కొనసాగనున్న జాతీయ సైలింగ్‌ శిక్షణ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈఎమ్‌ఈ సైలింగ్‌ అసోసియేషన్‌(ఈమ్‌ఈఎస్‌ఏ), లేజర్‌ క్లాస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌సీఏఐ) సహకారంతో నిర్వహిస్తున్న ఈ పోటీలను ఆదివారం లఫె్ట్‌నెంట్‌ జనరల్‌ టీఎస్‌ఏ నారాయణన్‌ ప్రారంభించారు. నౌకాయన రంగంలో నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు నావికులకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. చీఫ్‌ కోచ్‌, అర్జున అవార్డీ గ్రహీత, కెప్టెన్‌ రాజేష్‌ చౌదరి నేతృత్వం వహిస్తున్నారు. చివరి రోజైన ఈనెల 11న రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ హాజరుకానున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని