‘విశ్వేశ్వరయ్య గొప్పతనం భావి తరాలకు అవసరం’
eenadu telugu news
Published : 16/09/2021 03:41 IST

‘విశ్వేశ్వరయ్య గొప్పతనం భావి తరాలకు అవసరం’


కాళేశ్వరం ఈఇన్‌సీ బి.హరిరామ్‌కు అవార్డు ఇస్తున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి

హిమాయత్‌నగర్‌ న్యూస్‌టుడే: మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ‘ఇంజినీర్స్‌ డే’ వేడుకలను ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవనంలో బుధవారం సాయంత్రం నిర్వహించారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. అనేక విషయాల్లో విశ్వేశ్వరయ్యకు అనన్య సామాన్య ప్రతిభ ఉందన్నారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ ఇండియా తెలంగాణ శాఖ ఛైర్మన్‌ డాక్టర్‌ రమణ నాయక్‌, గౌరవ కార్యదర్శి టి.అంజయ్య, ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, మణిపూర్‌ వర్సిటీ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ తిరుపతిరావు, నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌, జేఎన్‌టీయూ వీసీ ప్రొ.కట్టా నర్సింహారెడ్డి పాల్గొన్నారు. ఉత్తమ ఇంజినీర్లుగా ఎంపికైన ప్రొ.శ్రీరాం వెంకటేశ్‌ (ఓయూ), డాక్టర్‌ ఎ.వేణుగోపాల్‌రావు (డి.ఆర్‌.డి.ఒ.), ప్రొ.ఆనంద్‌కిషోర్‌ కోలా (ఎన్‌.ఐ.టి. వరంగల్‌), బి.హరిరామ్‌ (నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌), డా.ప్రవీణ్‌కుమార్‌ వెంకట్రావ్‌ (ఐ.ఐ.ఐ.టి.- హైదరాబాద్‌), డా.సమీనా బేగం (సీఎస్‌ఐఆర్‌-హైదరాబాద్‌)కు పురస్కారాలిచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని