Disha Encounter case: నలుగురు తహసీల్దార్లను విచారించిన సిర్పూర్కర్ కమిషన్
eenadu telugu news
Published : 21/09/2021 15:36 IST

Disha Encounter case: నలుగురు తహసీల్దార్లను విచారించిన సిర్పూర్కర్ కమిషన్

హైదరాబాద్: దిశ ఎన్‌కౌంటర్‌ కేసుకు సంబంధించి సిర్పూర్కర్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా మృతుల పంచనామా నిర్వహించిన తహసీల్దార్లను కమిషన్ విచారిస్తోంది. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన నలుగురి మృతదేహాలకు ఫరూఖ్ నగర్, కొందుర్గు, కొత్తూరు, కేశంపేటకు చెందిన నలుగురు తహసీల్దార్లు పంచనామా నిర్వహించారు. ఇప్పటికే ఫరూఖ్ నగర్ తహసీల్దార్‌ను విచారించిన కమిషన్.. ఇవాళ కొందుర్గు, కొత్తూర్ తహసీల్దార్లను విచారించింది. పంచనామా నిర్వహించే సమయంలో పాటించాల్సిన నియమ నిబంధనల గురించి తహసీల్దార్లను కమిషన్‌ అడిగింది. వాటిని పాటించారా? లేదా? అని ప్రశ్నించింది. పంచనామా సందర్భంగా తీసుకున్న చర్యల గురించి తహసీల్దార్లు కమిషన్‌కు వివరించారు.

ఈ నెల 25వ తేదీ వరకు సిర్పూర్కర్ కమిషన్ విచారణ కొనసాగనుంది. సిట్‌కు నేతృత్వం వహించిన రాచకొండ సీపీ మహేశ్ భగవత్‌ను కమిషన్ విచారించనుంది. ఇప్పటికే మూడు విడతలుగా కమిషన్ సభ్యులు 14మందిని విచారించారు. ప్రభుత్వం తరఫున హోంశాఖ కార్యదర్శి రవిగుప్త హాజరయ్యారు. సిట్ దర్యాప్తు అధికారి సురేందర్ రెడ్డిని కమిషన్ సుదీర్ఘంగా విచారించింది. మృతుల కుటుంబసభ్యుల నుంచి కమిషన్ వాంగ్మూలం నమోదు చేసుకుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని