పిల్లలను దేశం ఆస్తిగా తీర్చిదిద్దాలి
eenadu telugu news
Published : 22/09/2021 03:53 IST

పిల్లలను దేశం ఆస్తిగా తీర్చిదిద్దాలి


పురస్కార గ్రహీతలతో లక్ష్మీనారాయణ

రవీంద్రభారతి, న్యూస్‌టుడే: ఈతరం తల్లిదండ్రులు పిల్లల కోసం ఆస్తులు సంపాదించే పనిలో ఉంటున్నారని, పిల్లలకు ఇవ్వాల్సింది ఆస్తులు కాదని, వారిని దేశం ఆస్తిగా తీర్చిదిద్దాలని సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ (జేడీ) వి.వి.లక్ష్మీనారాయణ అన్నారు. అంతర్జాతీయ శాంతి దినోత్సవం సందర్భంగా పినాకిని యూత్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం రవీంద్రభారతిలో ప్రపంచ శాంతి సేవా పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఏ మార్పు అయిన ఇంటి నుంచే ప్రారంభం కావాలన్నారు. కవి, రచయిత కె.మురళీమోహన్‌ రాజు ఆచార్య కె.సీతారామరావు, విజయకుమార్‌, కె.లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని