నీడనిస్తూ.. నాలాలను విస్తరిస్తూ
eenadu telugu news
Published : 22/09/2021 06:01 IST

నీడనిస్తూ.. నాలాలను విస్తరిస్తూ

జోన్ల వారీగా ఆక్రమణల తొలగింపుపై క్షేత్రస్థాయిలో సర్వే

ఈనాడు, హైదరాబాద్‌: వరదల నుంచి నగరాన్ని రక్షించే చర్యల్లో కదలిక వచ్చింది. బల్దియా టౌన్‌ప్లానింగ్‌, ఇంజినీరింగ్‌, రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. నాలాల పొడవునా సర్వే చేపట్టారు. విస్తరణకు అవసరమైన భూసేకరణకు నడుం బిగించారు. పనులు త్వరలో కొలిక్కి రానున్నాయి. ఆక్రమణల తొలగింపునకు ఇబ్బందులు తలెత్తకుండా.. నిర్వాసితులకు ప్రభుత్వం నిర్మిస్తోన్న రెండు పడక గదుల ఇళ్లను ఇచ్చేందుకు సర్కారు సిద్ధంగా ఉందని జీహెచ్‌ఎంసీ స్పష్టం చేస్తోంది.

రూ.858 కోట్లతో..

ముంపు తప్పించేందుకు గతంలో చేపట్టిన సర్వేలన్నింటినీ సర్కారు ఇటీవల పక్కనపెట్టింది. ప్రస్తుతం ఉన్న భౌగోళిక, వాస్తవిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొత్త కార్యాచరణ రూపొందించింది. వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమాన్ని(ఎస్‌ఎన్‌డీపీ) తెరపైకి తెచ్చింది. వేర్వేరు విభాగాల ఇంజినీర్లతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. కొత్తగా కన్సల్టెన్సీతో అభివృద్ధి ప్రణాళిక తయారు చేయించింది. అందులో భాగంగా మంత్రి కేటీఆర్‌ రూ.858కోట్లతో పనులు చేపట్టేందుకు అనుమతి ఇచ్చారు. ప్రతి జోనల్‌ కమిషనర్‌ మొదట ఒక నాలాను ఎంపిక చేసి, దాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి చూపిద్దామని మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఆ మేరకు జెడ్సీలు సర్వే చేపట్టారు. నాలాల పొడవు, ఆక్రమణలు, ప్రజల స్థితిగతుల వివరాలు సేకరిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని