నిరంతర ప్రేరణతోనే నైపుణ్యాల పెంపు
eenadu telugu news
Published : 23/09/2021 01:34 IST

నిరంతర ప్రేరణతోనే నైపుణ్యాల పెంపు


విద్యార్థి అశోక్‌ను అభిరనందిస్తున్న కలెక్టర్‌ నిఖిల

వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఇన్‌స్పైర్‌ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థి అశోక్‌ను కలెక్టర్‌ నిఖిల అభినందించి సత్కరించారు. బుధవారం పాలనాధికారి కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి తయారు చేసిన నమూనా గురించి ఆమె తెలుసుకున్నారు. అనంతరం పాలనాధికారిణి మాట్లాడుతూ.. నిరంతర ప్రేరణతో విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. దౌల్తాబాద్‌ మండలం జడ్పీహెచ్‌ఎస్‌ గోకఫస్లాబాద్‌ పాఠశాలకు చెందిన విద్యార్థి జాతీయ స్థాయిలో జిల్లాకు పేరు తేవడం ఎందరికో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. విద్యార్థికి ల్యాప్‌టాప్‌ ఇస్తామన్నారు. ఈ సందర్భంగా డీఆవో రేణుకాదేవి, గైడ్‌ ఉపాధ్యాయుడు శాంత్‌కుమార్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హన్మప్ప, జిల్లా సైన్స్‌ అధికారి విశ్వేశ్వర్‌లను సన్మానించారు చెందిన కార్యక్రమంలో జిల్లా అదనపు పాలనాధికారి చంద్రయ్య, సెక్టోరియల్‌ అధికారి రవికుమార్‌ పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని