Crime News: ‘మీరు పర్సనల్‌ లోన్‌ తీసుకోండి.. నేను రూ.లక్షల్లో లాభాలిస్తా!’
eenadu telugu news
Updated : 25/09/2021 07:23 IST

Crime News: ‘మీరు పర్సనల్‌ లోన్‌ తీసుకోండి.. నేను రూ.లక్షల్లో లాభాలిస్తా!’

సహోద్యోగులు, స్నేహితులకు రూ.3.73 కోట్లు టోకరా


సురేష్‌బాబు

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘మీరు వ్యక్తిగత రుణాలు తీసుకోండి.. వాటిని స్థిరాస్తి వ్యాపారంలో మదుపు చేసి రూ.లక్షల్లో లాభాలిస్తా... మీ రుణాలకు నెల వాయిదాలు నేనే చెల్లిస్తానంటూ’’ సహోద్యోగులు, స్నేహితులను మోసం చేసి రూ.3.73 కోట్లు కొట్టేసిన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ పోకూరి సురేష్‌బాబును హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. కొద్దినెలలు వాయిదాలు చెల్లించాడని, కూకట్‌పల్లిలో ఉంటూ ఏడాది క్రితం పారిపోయాడంటూ బాధితులు ఇటీవల సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడి కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. విజయవాడలో ఉంటున్న అతన్ని ఎస్సై లక్ష్మయ్య శుక్రవారం అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తీసుకొచ్చి చంచల్‌గూడ జైలుకు తరలించారు. కొల్లగొట్టిన డబ్బును తన భార్య ఖాతాల్లోనూ జమచేయించుకున్నాడని, ఆమె పాత్రపైనా ఆరా తీస్తున్నామని ఏసీపీ భిక్షంరెడ్డి తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని