అనుమానాస్పదస్థితిలో డీలరు మృతి
eenadu telugu news
Published : 25/09/2021 05:41 IST

అనుమానాస్పదస్థితిలో డీలరు మృతి

 

దిగ్వాల్‌(కోహీర్‌): అనుమానాస్పద స్థితిలో రేషన్‌ డీలరు మృతిచెందిన ఘటన మండల పరిధిలోని దిగ్వాల్‌ శివారులో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై రాజశేఖర్‌ కథనం ప్రకారం. . ఝరాసంగం మండలం చిల్కేపల్లి గ్రామానికి చెందిన గొల్ల నర్సింహులు(41) పౌర సరఫరాల శాఖ రేషన్‌ డీలరుగా పనిచేస్తున్నాడు. సొంత పనుల నిమిత్తం శుక్రవారం ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఇదిలా ఉండగా... దిగ్వాల్‌ గ్రామానికి చెందిన బుదారం నర్సింహులు గ్రామ శివారులోని తనకు ఉన్న పొలానికి వచ్చాడు. వ్యవసాయ బావి పక్కన దుస్తులు, పాదరక్షలు ఉండటాన్ని గుర్తించి బావిలోకి తొంగి చూడగా.. నీటిపై మృతదేహం తేలియాడుతూ కనిపించింది. ఈ విషయాన్ని దిగ్వాల్‌ గ్రామ పెద్దలకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏఎఎస్‌ఐ సంగమేశ్వర్‌, సిబ్బంది కలిసి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం జహీరాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. తన భర్త చావు బుదారం గ్రామానికి చెందిన ఓ మహిళపై అనుమానం ఉన్నట్లు ఆయన భార్య రుక్మిణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. నర్సింహులుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని