రెండు తలల దూడ జననం
eenadu telugu news
Updated : 25/09/2021 10:49 IST

రెండు తలల దూడ జననం

 

బషీరాబాద్‌, న్యూస్‌టుడే: ఓ గేదె రెండు తలల దూడకు జన్మనిచ్చిన సంఘటన వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. జీవన్గీ గ్రామానికి చెందిన రైతు వీరారెడ్డి వద్ద ఉన్న గేదె ప్రసవవేదనతో ఇబ్బంది పడుతోంది. కొంత సమయం తర్వాత రెండు తలలు బయటకు రావడం మొదలైంది. గంటల తరబడి ప్రసవం కాకపోవడంతో పశువైద్య సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి దూడను బయటకు తీశారు. రెండు తలలు ఉన్న విషయం తెలిసి రైతులంతా అక్కడికి చేరి ఆసక్తిగా తిలకించారు. దూడ బలహీనంగా ఉండటంతో నడవలేక పోతోందని పాలను పట్టించామని వీరారెడ్డి తెలిపారు. జన్యుపరమైన లోపంతో అరుదుగా ఇలాంటి దూడలు పుడుతుంటాయని బషీరాబాద్‌ పశువైధ్యాధికారి హతిరాం తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని