కాలువలో మృతదేహం.. చంపాపేట వాసిగా గుర్తింపు
eenadu telugu news
Updated : 29/09/2021 05:32 IST

కాలువలో మృతదేహం.. చంపాపేట వాసిగా గుర్తింపు

వేణుగోపాల్‌

సైదాబాద్‌, న్యూస్‌టుడే: వారం రోజుల క్రితం వరద కాలువలో కొట్టుకొచ్చిన వ్యక్తి మృతదేహం ఆచూకీపై మిస్టరీ వీడింది. మృతుడు చంపాపేట పరిధి రెడ్డికాలనీ నివాసి వేణుగోపాల్‌ (49)గా గుర్తించారు. కొడుకు, కుమార్తె చెప్పిన ఆనవాళ్లు.. మృతదేహంతో సరిపోలడంతో వారికి అప్పగించారు. మృతుడి భార్య మాత్రం ఇందుకు ఒప్పుకోలేదు. ఆమె విజ్ఞప్తి మేరకు డీఎన్‌ఏ పరీక్ష చేయనున్నారు. నాలుగు నెలల్లో నివేదిక ఆధారంగా పూర్తి వివరాలు తెలుస్తాయని సైదాబాద్‌ పోలీసులు పేర్కొంటున్నారు. ఐఎస్‌సదన్‌ డివిజన్‌ కృష్ణానగర్‌-ఆదర్శ్‌నగర్‌ మార్గంలో సరూర్‌నగర్‌ చెరువుకు వెళ్లే వరద కాలువలో ఈనెల 20న గుర్తుతెలియని మృతదేహం కొట్టుకొచ్చిన విషయం విధితమే. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈనెల 2న రెడ్డికాలనీకి చెందిన వేణుగోపాల్‌ (49) అదృశ్యమవగా.. ఈనెల 6న కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులను మృతదేహాన్ని భద్రపరిచిన ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. గుర్తుపట్టలేనంతగా కుళ్లిపోయి ఉండగా ఆనవాళ్ల ప్రకారం 60 శాతం మేరకు వేణుగోపాల్‌గానే భావించారు. భార్య ఇందుకు సమ్మతించలేదు. ఆమె కోసం కుటుంబ సభ్యులు డీఎన్‌ఏ పరీక్ష చేయించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని