శంషాబాద్‌ విమానాశ్రయంలో మహిళ వద్ద విదేశీ కరెన్సీ స్వాధీనం
eenadu telugu news
Published : 25/10/2021 15:20 IST

శంషాబాద్‌ విమానాశ్రయంలో మహిళ వద్ద విదేశీ కరెన్సీ స్వాధీనం

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి కస్టమ్స్‌ అధికారులు పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఆ మహిళ నుంచి ఇండియన్‌ కరెన్సీలో రూ.10.09 లక్షల విలువైన 500 సౌదీ రియాల్స్‌ 101 నోట్లను పట్టుకున్నట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. అబుదాబీ వెళ్లేందుకు అలీయా భాను అనే మహిళ శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. ఆమెను తనిఖీ చేయగా సౌదీకి చెందిన 500 రియాల్స్‌ 101 నోట్లు బయటపడ్డాయని అధికారులు స్పష్టం చేశారు. అలీయా భాను ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు వివరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని