30, 31న ‘ఈనాడు’ ప్రాపర్టీ షో
eenadu telugu news
Published : 28/10/2021 05:47 IST

30, 31న ‘ఈనాడు’ ప్రాపర్టీ షో

ఈనాడు, హైదరాబాద్‌: కొత్త ఇల్లు కొనాలనుకున్నా.. ఎక్కడ కొనాలి? ఎందులో కొనాలి? గేటెడ్‌ కమ్యూనిటీలో మేలా? సాధారణ అపార్ట్‌మెంట్‌ అయినా ఫర్వాలేదా? ఈ రెండు కాకుండా శివార్లలో విల్లాలా? ఇలా బోలెడు సందేహాలు.
నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో చేపట్టిన గృహ నిర్మాణాల గురించి తెలిస్తే తప్ప ఒక నిర్ణయానికి రాలేని పరిస్థితి. నగరమంతటా తిరగడమూ సాధ్యమయ్యే పని కాదు. స్థిరాస్తి కొనుగోలు సందర్భంగా మీ అన్వేషణను సులభతరం చేసేందుకు ‘ఈనాడు’ ఈనెల 30, 31 తేదీల్లో ప్రాపర్టీ షో నిర్వహిస్తోంది. తద్వారా నగరంలో ప్రముఖ, ఓ మోస్తరు స్థిరాస్తి సంస్థలు చేపట్టిన ప్రాజెక్టులన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొస్తోంది. హైటెక్‌సిటీలోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో ఇందుకు ఈ ప్రాపర్టీ షోకు వేదిక కానుంది. లేఅవుట్‌ వెంచర్ల నుంచి ఆకాశహార్మ్యాల వరకు స్థిరాస్తి సంస్థలు తమ ప్రాజెక్టుల గురించి స్టాళ్లలో ప్రదర్శించనున్నాయి. నిర్మాణ దశలో ఉన్నవి, కొత్తగా రాబోతున్నవాటి గురించి కొనుగోలుదారులకు సంబంధిత సిబ్బంది వివరించనున్నారు. పండుగల సందర్భంగా కొన్ని సంస్థలు ప్రత్యేక తగ్గింపు ధరలనూ ఇస్తున్నాయి. తమకు నచ్చిన స్థిరాస్తిని ఎంపిక చేసుకోవచ్చు. అక్కడే ఉండే బ్యాంకుల స్టాళ్లలో తమ ఆదాయానికి ఎంతవరకు గృహరుణం వస్తుంది? వడ్డీరేట్లు ఎక్కడ తక్కువగా ఉన్నాయనేదీ తెలుసుకోవచ్చు. స్థలాలకు రుణాలు పొందొచ్చు. ప్రత్యక్షంగా అన్ని వివరాలు తెలుసుకునేందుకు శని, ఆదివారాల్లో ఉదయం 10 నుంచి రాత్రి 7 గంటల వరకు జరిగే ప్రాపర్టీ షోకు విచ్చేయండి. ప్రవేశం ఉచితం. వివరాలకు 9701112439, 8008552667 చరవాణి నంబర్లలో సంప్రదించవచ్చు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని