TS News: కేంద్రం నుంచి లేఖ తెప్పించండి.. భాజపాకు నిరంజన్‌రెడ్డి సవాల్‌
eenadu telugu news
Updated : 28/10/2021 13:18 IST

TS News: కేంద్రం నుంచి లేఖ తెప్పించండి.. భాజపాకు నిరంజన్‌రెడ్డి సవాల్‌

హైదరాబాద్‌: యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం నుంచి సాయంత్రం 5 గంటలలోగా లేఖ తెప్పించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి భాజపాకు సవాల్‌ విసిరారు. లేఖ తెస్తే తాను రాజీనామా చేస్తానని లేకపోతే దీక్షకు దిగిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రాజీనామా చేయాలన్నారు. ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష కోట్లు ఖర్చు చేసిందని మంత్రి వివరించారు. ప్రతీ గ్రామంలో కొనుగోలు కేంద్రాలు పెట్టామని వివరించారు.
నిల్వలు ఉన్నాయని ధాన్యం కొనలేమంటూ కేంద్రం లేఖ పంపిందని నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. వానాకాలం పంటకు ఎలాంటి ఇబ్బంది లేదని.. రైతులెవరూ నిరాశ చెందాల్సిన పనిలేదని నిరంజన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. మరోవైపు వరి సాగుపై తెలంగాణ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బండి సంజయ్‌ దీక్షకు దిగిన నేపథ్యంలో మంత్రి స్పందించారు. కేంద్రం ప్రతిగింజా కొనే వరకు భాజపా నేతలు దీక్ష కొనసాగించాలని చురకలంటించారు. రైతులను తప్పుదోవ పట్టించే తీరు మానుకోవాలని హితవు పలికారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని