ప్రశాంతంగా ట్రిపుల్‌ఐటీ ప్రవేశ పరీక్ష
eenadu telugu news
Published : 27/09/2021 06:17 IST

ప్రశాంతంగా ట్రిపుల్‌ఐటీ ప్రవేశ పరీక్ష


కడపలో పరీక్షను పర్యవేక్షిస్తున్న డీఈవో శైలజ

 

కడప విద్య, ప్రొద్దుటూరు, న్యూస్‌టుడే : ఆర్‌జీయూకేటీ- 2021 ట్రిపుల్‌ఐటీలో ప్రవేశం కోసం ఆదివారం నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా 52 పరీక్ష కేంద్రాలలో సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేశారు. 8,823 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉంది. 8,501 మంది హాజరయ్యారు. 322 మంది గైర్హాజరయ్యారు. కడప నగరంలోని పలు పరీక్ష కేంద్రాలను డీఈవో శైలజ తనిఖీ చేశారు. ప్రొద్దుటూరులో పరీక్ష కేంద్రాన్ని ఆర్జేడీ వెంకట కృష్ణారెడ్డి పరిశీలించారు. పట్టణంలో మొత్తం అయిదు కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి.

పశు సహాయకులకు...

కడప వ్యవసాయం : సచివాలయాల్లో పనిచేస్తున్న పశు సహాయకులకు నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం కడప నగరంలోని గాంధీనగర్‌ పురపాలక పాఠశాలలో పరీక్ష నిర్వహించారు. జిల్లాలోని 134 మంది పరీక్షకు హాజరయ్యారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరీక్ష నిర్వహించినట్లు జేడీ సత్యప్రకాశ్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని