రాష్ట్రస్థాయి బీచ్‌ రెజ్లింగ్‌లో బంగారు పతకాలు
eenadu telugu news
Published : 20/10/2021 05:04 IST

రాష్ట్రస్థాయి బీచ్‌ రెజ్లింగ్‌లో బంగారు పతకాలు


జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు

కడప క్రీడలు, న్యూస్‌టుడే: విశాఖపట్నంలో ఈనెల 16, 17 తేదీల్లో జరిగిన రాష్ట్ర స్థాయి బీచ్‌ రెజ్లింగ్‌ పోటీల్లో కడప క్రీడాకారులు సత్తాచాటి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా నుంచి కె.సాయిప్రతాప్‌రెడ్డి (80 కిలోలు), కేవీ శివతరుణ్‌ (ప్లస్‌ 90) తమ అత్యుత్తమ ప్రదర్శనతో రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకాలు సాధించారని శిక్షకులు కె.గణేష్‌ తెలిపారు. మహిళల విభాగంలో సి.కీర్తన వెండి, సి.రేణుక కాంస్య పతకం సాధించారన్నారు. నవంబరు 1 నుంచి 3వ తేదీ వరకు హర్యానాలో జరుగనున్న జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకాలు సాధించిన క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. కొవిడ్‌ తర్వాత నిర్వహించిన పోటీల్లో 8 మంది రెజ్లింగ్‌ విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు గణేష్‌ తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని