close

శుక్రవారం, ఆగస్టు 07, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఎన్టీపీసీ బంకర్‌లో పడి ఒప్పంద కార్మికుని మృతి
బంకర్‌లో పడిన కాలీముత్తు

జ్యోతినగర్‌, న్యూస్‌టుడే : ఎన్టీపీసీ బంకర్‌లో పడి ఒప్పంద కార్మికుడు మృతి సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రాత్రి విధులకు వెళ్లి తిరిగి రాకపోవటంతో యాజమాన్యం పరిశ్రమలో సీసీ పుటేజీ పరిశీలించి అణువణువూ గాలించారు. 12 గంటల అనంతరం బంకర్‌లో శవమై కనిపించాడు. తోటి ఒప్పంద కార్మికులు, ఎన్టీపీసీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామగుండం ఎన్టీపీసీ పరిశ్రమలోని కన్వేయర్‌ బెల్ట్‌ వద్ద బొగ్గులో అడ్డుగా వచ్చే బండలను(సేల్‌ పిక్కింగ్‌) తీసివేసే పనుల్లో దాదాపు 15 మంది విధులు చేపట్టారు. దాదాపు 15 రోజుల క్రితం తమిళనాడు తుత్తుకూడి నుంచి కాలీముత్తు(45) ఒప్పంద కార్మికునిగా విధుల్లో చేరాడు. బుధవారం రాత్రి విధులకు వెళ్లిన కాలీముత్తు బెల్ట్‌ వద్ద ప్రమాదవశాత్తు పడిపోయాడు. బెల్ట్‌ వెళ్తుండగా అక్కడ ఎవరూ లేకపోవటంతో పైపు పట్టుకోగా, అది విరిగిపోయి బెల్ట్‌ తెగిపోయింది. ఈ క్రమంలో 4వ యూనిట్‌ సమీపంలోని బంకర్‌లో పడిపోయి మృతి చెందాడు. అతనిపై బొగ్గు పడగా, ఎవరూ గుర్తించలేదు. రాత్రి విధులకు వెళ్లి ఉదయం 10 గంటల వరకూ కనిపించకపోవటంతో కార్మికులు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. బెల్ట్‌ తెగిపోవడం, కార్మికుడు కనిపించకపోవటంతో తీవ్రంగా గాలించారు. కన్వేయర్‌ బెల్ట్‌ వద్ద నిఘా కెమెరాలను పరిశీలించిన అధికారులు ప్రమాదవశాత్తు పడిన దృశ్యాలను గుర్తించారు. గురువారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ముత్తు మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. మృతుని మనువడు రాజురాయప్పన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎన్టీపీసీ ఎస్సై ఉమాసాగర్‌ తెలిపారు. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని, నష్టపరిహారం అందజేయాలని ఎన్టీపీసీ ఒప్పంద కార్మిక సంఘాల నాయకులు చిలుక శంకర్‌, నాంసాని శంకర్‌, శ్రీనివాస్‌, లక్ష్మణ్‌, సత్యం, సత్యనారాయణ డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.