ఉద్యమ తరహాలో టీకా పంపిణీ
eenadu telugu news
Published : 20/09/2021 03:25 IST

ఉద్యమ తరహాలో టీకా పంపిణీ

వ్యాక్సినేషన్‌పై సమీక్షిస్తున్న మంత్రి ఈశ్వర్‌

పెద్దపల్లి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో శత శాతం పంపిణీ లక్ష్యంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను ఉద్యమ తరహాలో నిర్వహించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సూచించారు. కొవిడ్‌ టీకా లక్ష్య ప్రగతిపై ఆదివారం కలెక్టర్‌ సంగీతసత్యనారాయణ, జడ్పీ ఛైర్మన్‌ పుట్ట మధూకర్‌, పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్‌, జిల్లా ఆరోగ్యశాఖ, సంబంధిత శాఖల అధికారులతో దూరదృశ్య మాధ్యమంలో మంత్రి సమీక్షించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ టీకా వేయాలన్నారు. వ్యాక్సిన్‌ కొరత ఉంటే తమ దృష్టికి తేవాలని సూచించారు. అర్హులందరికీ వ్యాక్సిన్‌ అందించేందుకు అధికారులు నిర్విరామంగా శ్రమించాలన్నారు. ఇందుకు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సర్వే సంగీతసత్యనారాయణ జిల్లాలో వ్యాక్సినేషన్‌ ప్రగతిని వివరించారు. జిల్లా వ్యాప్తంగా 222 ప్రత్యేక బృందాలతో టీకా శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. 5.5 లక్షల మందికి పైగా అర్హులున్నట్లు గుర్తించగా వీరిలో 4,51,138 మందికి మొదటి డోసు పూర్తయిందన్నారు. ఈ నెల 17 నుంచి ప్రత్యేక శిబిరాల ద్వారా 13 వేల మందికి టీకా వేసినట్లు చెప్పారు. జిల్లా వైద్యాధికారి ప్రమోద్‌కుమార్‌, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్లు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని