టెండర్‌ అప్పగించినా.. కార్మికులతోనే పని..
eenadu telugu news
Published : 20/09/2021 03:25 IST

టెండర్‌ అప్పగించినా.. కార్మికులతోనే పని..


ఓ డివిజన్‌లో గుంతలను కంకరపొడితో నింపుతున్న పారిశుద్ధ్య కార్మికుడు

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో వినాయక నిమజ్జన ఉత్సవాల కోసం రహదారులపై గుంతలు లేకుండా తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. నగరంలోని 60వ డివిజన్‌లో రూ.30లక్షలతో 57పనులు చేసేందుకు ఇంజినీరింగ్‌ అధికారులు టెండర్లు పిలిచారు. ఆయా ప్రాంతాల్లో చేపట్టిన పనులు ఈసారి పర్వాలేదని తెలుస్తుండగా..గుత్తేదారులు పలు చోట్ల అనుసరించిన తీరు విమర్శలకు దారి తీసింది. పనులు దక్కించుకున్న గుత్తేదారులు అధికారులు సూచించిన విధంగా రోడ్లపై ఉన్న గుంతలలో కంకరపోడి పోయడం, సీసీ రోడ్లపై ప్యాచ్‌ వర్క్‌ చేయడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది. వీధులలో కంకర కుప్పలు పోసి వీటిని గుంతలలో నింపి సమం చేయాలి. అయితే కొన్ని డివిజన్లలో పారిశుద్ధ్య కార్మికులతోనే ఆ పనులు చేయించారు. మరికొన్ని చోట్ల శానిటేషన్‌ కోసం తిరిగే ట్రాక్టర్లను వినియోగించి కంకర లోడు తెప్పించారు. గుత్తేదారులు చేయాల్సిన పనులను పారిశుద్ధ్య కార్మికులతో చేయించడం కన్పించింది. సీసీ రోడ్లు వేసిన తర్వాత గుత్తేదారులు రోడ్లను ఊడ్చి కడిగి ఇవ్వాల్సి ఉండగా నగరపాలక యంత్రాంగాన్ని వినియోగించుకోవడం సాధారమైనా..ఉన్నతాధికారులు కిమ్మనకుండా ఉండటంలో మతలబు ఏమిటో అర్థం కాకుండా మారిందని పలువురు పేర్కొంటున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని