భారతీయ వారసత్వ సంపద యోగా
eenadu telugu news
Published : 26/09/2021 03:46 IST

భారతీయ వారసత్వ సంపద యోగా


యోగా పోటీల్లో క్రీడాకారులు

కరీంనగర్‌ క్రీడా విభాగం, న్యూస్‌టుడే: యోగా భారత వారసత్వ సంపదగా విరాజిల్లుతోందని కరీంనగర్‌ జిల్లా అదనపు పాలనాధికారి గాజుల శ్యాంప్రసాద్‌లాల్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా యోగా అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని అంబేడ్కర్‌ స్టేడియం యోగా హాల్లో శనివారం జిల్లా స్థాయి యోగాసన పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై యోగా పోటీలను ప్రారంభించారు. అనంతరం విజేతలకు పతకాలు అందించారు. కార్యక్రమంలో జిల్లా యోగా అసోసియేషన్‌ అధ్యక్షుడు, మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌, జిల్లా యువజన, క్రీడా అధికారి కె.రాజవీరు, జిల్లా యోగా అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు కృష్ణ, సంపత్‌ కుమార్‌, డాక్టర్‌ మౌనిక, జిల్లా కార్యదర్శి సిద్ధారెడ్డి, యోగా శిక్షకులు కిష్టయ్య, గణేష్‌, హరి, ప్రసాద్‌ పాల్గొన్నారు.


పతకాలు అందజేస్తున్న శ్యాంప్రసాద్‌లాల్‌, రవీందర్‌సింగ్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని