Huzurabad by election: అందుకే తెరాస కార్యకర్తలు ఆవేశపడ్డారు: వినోద్‌కుమార్‌
eenadu telugu news
Published : 23/10/2021 13:49 IST

Huzurabad by election: అందుకే తెరాస కార్యకర్తలు ఆవేశపడ్డారు: వినోద్‌కుమార్‌

హుజూరాబాద్: ప్రభుత్వ పథకాలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ విమర్శించారు. ఉద్యమ కాలంలోని ఆకాంక్షలనే పథకాలుగా తెరాస నెరవేరుస్తోందని స్పష్టం చేశారు. హుజూరాబాద్‌ సిరిసేడులో తెరాస పార్టీ కార్యాలయం ముందు ఆగి కేసీఆర్‌పై వ్యాఖ్యలు చేయడం వల్లే కార్యకర్తలు ఆవేశపడ్డారని వివరణ ఇచ్చారు. కార్యకర్తలు ఆవేశపడ్డారు కానీ కిషన్‌రెడ్డిపై దాడి చేయలేదని తెలిపారు. ఓట్లు వేసినా వేయకపోయినా ఎవరికీ పథకాలు ఆగవని వినోద్‌ వివరించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని