మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అవసరం
eenadu telugu news
Published : 24/10/2021 04:29 IST

మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అవసరం

ప్రసంగిస్తున్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌

కొడిమ్యాల, న్యూస్‌టుడే: దేశంలో 50 శాతానికి పైగా ఉపాధ్యాయులు ప్రైవేటు విద్యాసంస్థల్లోనే చదువుకొనసాగిస్తున్నారని, అతిపెద్ద ప్రజాస్వామ్యదేశమైన మన దేశంలో విద్య, ఆరోగ్యం కోసం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ చాలా అవసరమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపెల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. కొడిమ్యాల మండలం నాచుపల్లి శివారులో ‘ట్రస్మా’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి ‘మంతన్‌’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటి ప్రధాని నెహ్రూ రాజ్యాంగం అమలుచేసే సమయంలో 40 కోట్ల జనాభాకు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ప్రాముఖ్యతను వివరించారని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యాసంస్థల కంటే ప్రైవేటు సంస్థలే విద్యార్థులకు బోధన చేస్తున్నాయని వివరించారు. ఈ క్రమంలో ప్రైవేటు విద్యాసంస్థల సేవలు అభినందనీయమన్నారు. ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు మాట్లాడుతూ దేశ విద్యావ్యవస్థ పునర్నిర్మాణానికి ప్రైవేటు విద్యా సంస్థలు మూల స్తంభాలని కొనియాడారు. ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌, సంయుక్త కార్యదర్శి వొడ్నాల శ్రీనివాస్‌, సంయుక్త కోశాధికారి ఇన్నారెడ్డి, అసోసియేట్‌ అధ్యక్షుడు గంగారెడ్డి, అపుస్మా ప్రధాన కార్యదర్శి తులసీ ప్రసాద్‌, తమిళనాడు అధ్యక్షుడు మార్టిన్‌కెన్నెడీ, మహారాష్ట్ర ప్రతినిధి భరత్‌మాలిక్‌, కరీంనగర్‌, జగిత్యాల జిల్లా అధ్యక్షులు కోరెం సంజీవరెడ్డి, రవిప్రసాద్‌, వివిధ రాష్ట్రాల, జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. రెండు రోజులపాటు ఈ సమావేశాలు జరుగుతాయని నిర్వాహకులు వెల్లడించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని