ప్రజాధనం లూటీ: కాంగ్రెస్‌
eenadu telugu news
Published : 20/10/2021 01:48 IST

ప్రజాధనం లూటీ: కాంగ్రెస్‌


బాలగనూరు సభలో కాంగ్రెస్‌ నేతలు రణదీప్‌ సుర్జేవాల, మల్లికార్జునఖర్గె, ఈశ్వర్‌ ఖండ్రె తదితరులు

విజయపుర, న్యూస్‌టుడే : నిత్యావసరాల ధరలను పెంచడం ద్వారా భాజపా ప్రభుత్వం ప్రజల్ని లూటీ చేస్తోందని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు రణదీప్‌ సుర్జేవాల ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం సిందగి నియోజకవర్గం పరిధిలోని బాలగనూరులో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. అంతకుముందు ఆయన కలబురగికి చేరుకున్నప్పుడు విమానాశ్రయంలో తనను కలుసుకున్న విలేకరులతో మాట్లాడారు. నిత్యావసరాలతో పాటు పెట్రోలియం ఉత్పత్తుల ధరలను ఇష్టానుసారంగా పెంచేస్తున్నారని ఆరోపించారు. ప్రజల్ని లూటీ చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్ని సాగనంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని భాజపా ప్రభుత్వం అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో మార్పు తథ్యమని జోస్యం చెప్పారు. ఎన్నికల ప్రచార సభలో రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జునఖర్గె, కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు ఈశ్వర్‌ ఖండ్రె, ఎం.బి.పాటిల్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని