భాజపా భీష్మ..కర్కి కన్నుమూత
eenadu telugu news
Published : 20/10/2021 01:48 IST

భాజపా భీష్మ..కర్కి కన్నుమూత

కార్వార, న్యూస్‌టుడే : ఉత్తర కన్నడ జిల్లా భాజపా భీష్ముడుగా గుర్తింపు పొందిన మాజీ శాసనసభ్యుడు డాక్టర్‌ ఎం.పి.కర్కి (87) కన్నుమూశారు. సోమవారం సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు వైద్య వృత్తిని కొనసాగించిన అనంతరం ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించి రెండుసార్లు హొన్నావర- కుమటా శాసనసభ్యుడుగా ఎన్నికయ్యారు. డాక్టర్‌ కర్కి మృతి పట్ల జిల్లా భాజపా నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని