గండ్లకు మరమ్మతులు
eenadu telugu news
Published : 26/10/2021 02:39 IST

గండ్లకు మరమ్మతులు

అనుముల్లంక కొండవాగు గండికి జేసీబీతో మరమ్మతు చేస్తున్న దృశ్యం

అనుముల్లంక (గంపలగూడెం), న్యూస్‌టుడే: మండలంలోని అనుముల్లంక పరిధిలోని కొండవాగు, కొత్త చెరువు, రాణీగారి చెరువుకు వెళ్లే దారిలో కట్టలకు పడిన గండ్లకు మరమ్మతులు చేసే పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. గత నెలలో వచ్చిన గులాబ్‌ తుపాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు వరద నీరు పోటెత్తడంతో ఆయా వాగుల పరిధిలోని కట్టలకు గండ్లు పడి, ప్రజల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. దీనిపై ఈనెల 20న ‘ఈనాడు’లో ‘ప్రయాణించాలంటే ఆలోచించాల్సిందే’ శీర్షికన ప్రచురించిన కథనానికి వైకాపా నేతలు స్పందించారు. ఎమ్మెల్యే రక్షణనిధి సూచన మేరకు జేసీబీతో వాగులపై కట్టలకు పడిన ఏడు గండ్లకు మరమ్మతులు చేపట్టినట్లు నాయకులు జి.శ్రీనివాసరెడ్డి, ఎ.పద్మారెడ్డి, డి.నరసారెడ్డి, జి.రంగారెడ్డి తెలిపారు. రెండు రోజుల్లో మొత్తం గండ్లు పూడ్పించి రాకపోకలకు ఆటంకం లేకుండా చేస్తామన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని