‘ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదాం’
eenadu telugu news
Published : 26/10/2021 02:39 IST

‘ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదాం’

కొనకళ్లను సత్కరించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు

మచిలీపట్నం(కోనేరుసెంటరు), న్యూస్‌టుడే: తెదేపా రాష్ట్ర కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమితులైన కొనకళ్ల జగన్నాథరావు(బుల్లయ్య)కు పలువురు తెదేపా నాయకులు, కార్యకర్తలు సోమవారం అభినందనలు తెలిపారు. మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలోని పాతేరు, ఎస్‌.ఎన్‌గొల్లపాలెం గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు, పామర్రు నియోజకవర్గం మర్రివాడ గ్రామానికి చెందిన నాయకులు, కార్యకర్తలు సోమవారం బుల్లయ్యను ఆయన నివాస గృహంలో కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేసి అవినీతి, అక్రమాలతో మునిగితేలుతున్న వైకాపా ప్రభుత్వానికి తగు గుణపాఠం చెప్పే దిశగా ప్రజలను చైతన్య పర్చడంలో పార్టీ శ్రేణులు క్రియాశీలకంగా వ్యవహరించాలని కోరారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని