
10 లోపు పేర్ల్ల నమోదు
కర్నూలు విద్య, న్యూస్టుడే: జాతీయ విపత్తుల నివారణ కేంద్రం, గృహ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో 14-18 సంవత్సరాలు కలిగిన 8-12వ తరగతి విద్యార్థులకు ఈనెల 28 నుంచి 30 వరకు వెబినార్ నిర్వహిస్తున్నట్లు విద్యాధికారి ఎం.సాయిరాం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమం సిస్కో వెబ్క్స్ ఆన్లైన్ ప్లాట్ఫాం ద్వారా జరుగుతుందని, ఆంగ్లం, హిందీ మాధ్యమంలో మాట్లాడాలన్నారు. వెబినార్లో పాల్గొనేవారు పది నిమిషాలకు మించి మాట్లాడరాదని, ఆసక్తి కలిగిన విద్యార్థులు 10వతేదీ లోపు https:///forms.gle/hFg7Y2Bi42bTwSud9 లింక్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని, పది నిమిషాల వీడియోను ccdrr.nidm@gmail.com మెయిల్ పంపాలన్నారు. వెబినార్ కార్యక్రమంపై ఉపాధ్యాయులు బాధ్యతగా విద్యార్థులు, తల్లిదండ్రులకు తెలియజేయాలని ఆదేశించారు.
Tags :