Published : 28/02/2021 03:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విద్యుదాఘాతంతో యువకుడు..

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: అనంతపురం మండలం కురుగుంట గ్రామంలో విద్యుదాఘాతంతో సురేంద్ర బాబు (27) అనే యువకుడు మృతిచెందాడు. ఎస్సై లక్ష్మీనారాయణ వివరాల మేరకు.. బనగానపల్లి మండలం నిలువుగండ్ల పల్లెకు చెందిన సురేంద్రబాబు తన బాబాయి ఇంటికి వచ్చాడు. కురుగుంటలో ఇంటి నిర్మాణం సాగుతుండటంతో గోడలకు నీరు పెట్టడానికి మోటారు ప్లగ్‌ తగిలిస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. యువకుడిని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని