ప్రజాధనం వృథా చేయొద్దు
eenadu telugu news
Published : 27/09/2021 04:01 IST

ప్రజాధనం వృథా చేయొద్దు

ప్రసంగిస్తున్న గరికపాటి నరసింహారావు

కర్నూలు నగరం, న్యూస్‌టుడే: కష్టపడి పనిచేసి సంపాదించుకునే విధానం ప్రజలకు అలవాటు చేయాలని, రూ.కోట్ల ప్రజా ధనాన్ని వృథా చేయకూడదని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సహస్రావధాని గరికపాటి నరసింహారావు అన్నారు. కర్నూలు శివారులోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం వికాసభారతి పుష్కరోత్సవ ముగింపు కార్యక్రమం జరిగింది. ప్రధాన వక్తగా హాజరైన గరికపాటి మాట్లాడుతూ.. ప్రజలకు రక్షణ, భద్రత, ఉపాధి కల్పన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, ప్రజా ధనాన్ని వృథా చేయకూడదని వ్యాఖ్యానించారు. ప్రధానంగా వేదాంతం, ఆధ్యాత్మికతపై శాసనసభ్యులకు అవగాహన ఉండాలన్నారు. వీరిని అవగాహన కల్పించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, తన ప్రసంగంతో ఒక్క ఎమ్మెల్యేలో మార్పు వచ్చినా చాలునన్నారు. సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూ, దేశ ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. కార్యక్రమంలో వికాసభారతి సంఘటనా కార్యదర్శి నాగేంద్రప్రసాద్‌, భాస్కరయోగి, కేవీ సుబ్బారెడ్డి, పత్తిఓబులయ్య, శివప్రసాద్‌, మురళీ, ఆవోపా అధ్యక్షులు యుగంధర్‌శెట్టి తదితరులు హాజరయ్యారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని