మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి చేయూత
eenadu telugu news
Published : 15/10/2021 05:29 IST

మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి చేయూత

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : జిల్లాలో చేపల వినియోగం పెంచి ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో మత్స్య శాఖ ద్వారా వివిధ పథకాలు అమలుచేస్తున్నామని, రైతులందరూ దీనిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జేసీ (రెవెన్యూ, రైతు భరోసా) ఎస్‌.రామసుందర్‌రెడ్డి అన్నారు. ఆయన గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి జూమ్‌ వీడియో కాన్ఫరెన్సు ద్వారా మత్స్య శాఖ పథకాల అమలుపై కమిటీ సభ్యులతో మాట్లాడారు. జిల్లాలోని ప్రతి సచివాలయానికి ఒకటి చొప్పున విజన్‌ ఫిష్‌ వెండింగ్‌ యూనిట్‌ ఏర్పాటుచేస్తున్నట్లు వివరించారు. పైన తెలిపిన పథకాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీలకు 60 శాతం, జనరల్‌ కేటగిరీకి 40 శాతం రాయితీ వర్తిస్తుందన్నారు. ఆసక్తిగల వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు మత్స్యశాఖ జేడీ (94408 14742))ని సంప్రదించాలన్నారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో వెంకటసుబ్బయ్య, మత్స్యశాఖ జేడీ శ్యామల, డీఆర్డీఏ పీడీ బీకే వెంకటేశులు, డీపీఎం చిన్న రాజేష్‌, జిల్లా స్థాయి మత్స్యశాఖ పథకాల అమలు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని