‘రాజకీయ ప్రయోజనాల కోసమే భూముల అమ్మకాలు’
logo
Published : 18/06/2021 02:58 IST

‘రాజకీయ ప్రయోజనాల కోసమే భూముల అమ్మకాలు’

హుజూర్‌నగర్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం తమ రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టిందని సీసీఎం రాష్ట్ర నాయకుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టానుసారంగా ఖర్చులు చేసి మిగులు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చి వాటిని తీర్చేందుకు ప్రభుత్వ ఆస్తులను విక్రయానికి పెట్టారని విమర్శించారు. తాత్కాలిక ప్రయోజనాలకు భూములను అమ్మి రాష్ట్ర భవిష్యత్తును ఇబ్బందుల పాలు చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. వెంటనే ఆలోచన విరమించుకోవాలని, అమ్మకాలకు సంబంధించి విడుదల చేసిన జీవోలను ఉపసంహరించుకోవాలని అన్నారు. కేంద్రం పెట్రోల్‌, డీ…జిల్‌ ధరలు పెంచుతున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై ఆభారాన్ని కొంత మేరకైనా తగ్గించేందుకు చర్యలు తీసుకోవటం లేదని అన్నారు. రేషన్‌ కార్డులు అర్హులందరికి ఇవ్వాలని రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. విత్తనాలు, ఎరువులు కల్తీ లేనివి అందించాలని కోరారు. దేశప్రయోజనాలను ఫణంగా పెట్టి పరిపాలన చేస్తున్న భాజపాలో ఈటల చేరటం సరైంది కాదని అన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, మల్లు లక్ష్మి, పులిచింతల వెంకటరెడ్డి, ముల్కపల్లి సీతయ్య, సైదులు, శ్రీరాములు, పల్లె వెంకటరెడ్డి, దుగ్గి బ్రహ్మం, జక్కుల వెంకటేశ్వర్లు, మురళి తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని