జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపిక
eenadu telugu news
Published : 02/08/2021 03:04 IST

జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపిక

బాణోతు శ్రీరాంనాయక్‌

మఠంపల్లి, న్యూస్‌టుడే: కనీస సదుపాయాలు లేని ఓ మారుమూల గ్రామానికి చెందిన నిరుపేద యువకుడు పట్టుదలతో చదివి జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికయ్యారు. మఠంపల్లి మండలం కొత్త దొనబండతండాకు చెందిన బాణోతు సైద, బుజ్జి దంపతుల కుమారుడు శ్రీరాంనాయక్‌ 2014లో ఓయూలో ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసి హైదరాబాద్‌లో న్యాయవాద వృత్తి చేపట్టారు. న్యాయమూర్తిగా ఎంపికై తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలన్న పట్టుదలతో ఇతర ఉద్యోగావకాశాలు వదులుకుని పోటీ పరీక్షలపై దృష్టిపెట్టారు. స్థానిక ప్రాథమిక, మఠంపల్లిలోని వీవీ ఉన్నత పాఠశాలల్లో తెలుగు మాధ్యమంలో పదోతరగతి వరకు చదువును కొనసాగించినట్లు శ్రీరాంనాయక్‌ చెప్పారు. లక్ష్యాన్ని చేరుకోవడం సంతోషంగా ఉందన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని