రైతు సంఘాల నాయకుల నిరసన
eenadu telugu news
Published : 28/10/2021 02:14 IST

రైతు సంఘాల నాయకుల నిరసన

నదిలో చితాభస్మాన్ని కలుపుతున్న రైతు సంఘాల నాకులు

నెల్లూరు (విద్య) : ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరిలో జరిగిన సంఘటనలో అమరులైన రైతుల చితాభస్మాన్ని బుధవారం నగరంలోని పెన్నాలో కలిపి రైతుసంఘాల నాయకులు నిరసన చేపట్టారు. ఏఐకేఎస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు ఆర్‌.వెంకయ్య మాట్లాడుతూ కేంద్రం మూడు రైతు చట్టాలను తీసుకొచ్చి రైతులకు గుదిబండగా మార్చిందన్నారు. నల్ల రైతు చట్టాలతో కార్పొరేట్‌ కబంధ హస్తాల్లోకి రైతులను నెట్టివేశారని ఆగ్రహించారు. రైతులను కారుతో ఢీకొట్టి వారి మరణాలకు కారణమైన మంత్రి కుమారుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్‌ ప్రభాకర్‌, రైతు సంఘ నేతలు బలిజేపల్లి వెంకటేశ్వర్లు, సుధాకర్‌రెడ్డి, రమణయ్యనాయుడు, షాన్‌వాజ్‌, దర్గాబాబు, ఏఐవైఎఫ్‌ జిల్లా కన్వీనర్‌ సునీల్‌, ఆదినారాయణ పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని