పదోన్నతులు, బదిలీలు చేపట్టాలి
eenadu telugu news
Published : 18/10/2021 05:55 IST

పదోన్నతులు, బదిలీలు చేపట్టాలి

మాట్లాడుతున్న బునేకర్‌ సంతోష్‌

బాన్సువాడ పట్టణం, న్యూస్‌టుడే: ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు వెంటనే చేపట్టాలని తపస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బునేకర్‌ సంతోష్‌ డిమాండ్‌ చేశారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో ఆరు నెలల క్రితం సీఎం ప్రకటన చేసినప్పటికీ అమల్లోకి నోచుకోలేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పెరిగినందున విద్యా వాలంటీరు, స్కావెంజర్లను వెంటనే నియమించి పాఠశాలలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కొవిడ్‌ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో గురుకుల వసతి గృహాలు తెరవాలన్నారు. సమావేశంలో తపస్‌ జిల్లా బాధ్యులు బాలరాజు, జంగిలి రాజు, మండలాధ్యక్షుడు నరసింహాచారి, ప్రధాన కార్యదర్శి శంకర్‌, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని