వర్ని ఎస్సైకి ప్రమాదం
eenadu telugu news
Published : 18/10/2021 05:55 IST

వర్ని ఎస్సైకి ప్రమాదం

ధ్వంసమైన పోలీసు వాహనం

వర్ని, న్యూస్‌టుడే: వర్ని ఎస్సై అనిల్‌రెడ్డి వాహనానికి ప్రమాదం చోటు చేసుకున్న ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. వరి కోతలు ప్రారంభమవడంతో ధాన్యం తరలించేందుకు  వందలాది లారీలు వస్తున్నాయి. ప్రధాన కూడళ్లలో రోడ్డుకిరువైపులా వాటిని నిలిపి ఉంచడంతో తరచూ ప్రమాదాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వర్ని ఎస్సై అనిల్‌రెడ్డి శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో పెట్రోలింగ్‌ నిర్వహించి వాహనాలను వేరే ప్రాంతాలకు తరలిస్తుండగా నిజామాబాద్‌ నుంచి వస్తున్న ఒక లారీ వేగంగా వచ్చి పోలీసు వాహనాన్ని ఢీకొంది. సుమారు పది అడుగుల దూరం వెళ్లి ప్రధాన రహదారిలో ఉన్న డివైడర్‌ను ఢీకొని ఆగింది. అందులో ఉన్న ఎస్సై, కానిస్టేబుల్‌ అప్రమత్తమవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వాహనం ధ్వంసమైంది. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధాన్యం కొనుగోలు చేసే వ్యాపారులు నిబంధనలు పాటించకపోతే కేసులు నమోదు చేస్తామని ఇన్‌ఛార్జి ఎస్సై భవాని హెచ్చరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని