దొరకని మత్స్యకారుడి ఆచూకీ
eenadu telugu news
Published : 28/09/2021 04:47 IST

దొరకని మత్స్యకారుడి ఆచూకీ

ఉప్పుటేరులోకి కొట్టుకొచ్చిన బోటు


నువ్వలరేవు ఉప్పుటేరు వద్దకు కొట్టుకొచ్చిన ఇంజిన్‌ బోటు

వజ్రపుకొత్తూరు, న్యూస్‌టుడే: పడవ తిరగబడిన ప్రమాదంలో గల్లంతయిన యువకుడు బుంగ మోహనరావు ఆచూకీ సోమవారం రాత్రి వరకూ లభ్యం కాలేదు. ఆదివారం సాయంత్రం మొదలు అటు గంగువాడ నుంచి ఇటు దేవునల్తాడ వరకు మంచినీళ్లపేట గ్రామస్థులతో పాటు ఆయా తీర గ్రామాల మత్స్యకారులు, భావనపాడు మెరైన్‌ పోలీసులు బృందాలుగా విడిపోయి తీరం వెంబడి గాలిస్తున్నారు. ఇప్పటికీ ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదానికి గురైన బోటు నువ్వలరేవు ఉప్పుటేరులోకి కొట్టుకొచ్చింది. ఇంజిన్‌ భాగం పూర్తిగా దెబ్బతిందని బాధిత మత్స్యకారులు వాపోయారు. ప్రభుత్వ యంత్రాంగం స్పందించి గల్లంతయిన యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేయాలని బాధిత మంచినీళ్లపేట గ్రామస్థులు కోరుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని