మహా నృత్య ప్రదర్శనకు ఇచ్ఛాపురం కళాకారులు
eenadu telugu news
Published : 24/10/2021 06:12 IST

మహా నృత్య ప్రదర్శనకు ఇచ్ఛాపురం కళాకారులు

నాట్యసాధన చేస్తున్న యువతులు

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: హైదరాబాద్‌లో జరిగే రెండో ప్రపంచ కూచిపూడి మహానృత్య ప్రదర్శనలో పాల్గొనే అద్భుత అవకాశాన్ని ఇచ్ఛాపురం శ్రీవెంకటేశ్వర డాన్స్‌ అకాడమీ కళాకారులు దక్కించుకున్నారు. శంషాబాద్‌లోని త్రిదండి చినజీయరు స్వామి ఆశ్రమ ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం ఈ ప్రదర్శన జరుగుతుందని అకాడమీ అధ్యక్షులు వెంకటేశ్వర పట్నాయక్‌ తెలిపారు. పద్మభూషణ్‌ వెంపటి చినసత్యం 92వ జయంతిని పురస్కరించుకుని జరిగే ఈ మహావేడుకలో వివిధ దేశాల నుంచి నాట్య కళాకారులు పాల్గొంటారని చెప్పారు. కళాకారులతో పాటు వారి కుటుంబ సభ్యులు శనివారం ఇచ్ఛాపురం నుంచి బయలుదేరారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని