గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేయండి
eenadu telugu news
Published : 24/10/2021 06:14 IST

గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేయండి

కరదీపికను ఆవిష్కరిస్తున్న జె.మురళి, తదితరులు

బూర్జ, న్యూస్‌టుడే: గ్రామాభివృద్ధే లక్ష్యంగా అధికారులు పని చేయాలని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌(ఏపీఎస్‌ఐఆర్‌డీ) పంచాయతీరాజ్‌ డైరెక్టరు జె.మురళి పేర్కొన్నారు. బూర్జ ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ఎంపీపీ కర్నేన దీప అధ్యక్షతన ఉప సర్పంచులు, వార్డు మెంబర్లకు ప్రాథమిక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలను అర్హులకు చేర వేయడంలో కీలకపాత్ర పోషించాలని చెప్పారు. అనంతరం కరదీపికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో బి.లక్ష్మీపతి, డీపీవో వి.రవికుమార్‌, జడ్పీటీసీ సభ్యుడు బి.రామారావు, ఎంపీడీవో కె.సురేష్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని