రక్షణశాఖలో మహిళల విధులపై ఆరా
eenadu telugu news
Published : 18/09/2021 05:39 IST

రక్షణశాఖలో మహిళల విధులపై ఆరా

సాత్పురా నౌకపై పార్లమెంటరీ మహిళా సాధికారిత కమిటీ సభ్యులు, నేవీ అధికారులు

సింధియా, న్యూస్‌టుడే : పార్లమెంటరీ మహిళా సాధికారిత కమిటీ సభ్యులు మూడు రోజుల నగర పర్యటన నిమిత్తం విశాఖ చేరుకున్నారు. 20 మంది లోక్‌సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులున్న కమిటీ శుక్రవారం తూర్పునావికాదళాన్ని(ఈఎన్‌సీ) సందర్శించింది. ఈఎన్‌సీ కమాండింగ్‌-ఇన్‌-చీఫ్‌ వైస్‌అడ్మిరల్‌ అజేంద్ర బహదూర్‌సింగ్‌ను కలిసి నౌకాదళ రక్షణ విధుల్లో మహిళా ఉద్యోగుల సేవలపై ఆరా తీశారు. యుద్ధనౌకలు ఐఎన్‌ఎస్‌ సాత్పురా, ఐఎన్‌ఎస్‌ కోరాను వీక్షించి... వాటి పనితీరును తెలుసుకున్నారు. అనంతరం నేవల్‌ డాక్‌యార్డులోని సమరస్థల్‌ వద్ద అమరులకు నివాళి అర్పించారు. డాక్టర్‌ హీనావిజయకుమార్‌ బృంద ప్రతినిధిగా వ్యవహరించారు. వారందరికీ వైస్‌అడ్మిరల్‌ ఏబీ సింగ్‌ చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని