తపాలాశాఖల్లో న్యాయ సేవల వివరాలు
eenadu telugu news
Published : 19/09/2021 04:08 IST

తపాలాశాఖల్లో న్యాయ సేవల వివరాలు

ప్రసంగిస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి హరిహరనాథశర్మ

విశాఖ లీగల్‌, న్యూస్‌టుడే: దేశవిదేశాలలో సేవలు అందిస్తున్న తపాలాశాఖ, ప్రజలకు న్యాయసేవలు అందించడంలో కూడా పాలుపంచుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.హరిహరనాథశర్మ అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవాసదన్‌లో శనివారం జిల్లా న్యాయసేవల సాధికార సంస్థ. ఆధ్వర్యంలో తపాలాశాఖ అధికారులకు న్యాయసేవలపై శిక్షణ శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ అన్ని తపాలా శాఖల్లో న్యాయసేవల వివరాలను తెలియజేస్తూ బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉచితంగా న్యాయసహాయాన్ని అందించే దరఖాస్తులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు. జిల్లా న్యాయసేవల సాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి కె.కె.వి.బులికృష్ణ తపాలాశాఖ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో అనకాపల్లి డివిజన్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌ జె.ప్రసాద్‌బాబు, విశాఖ సహాయ పోస్టల్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాసరెడ్డి, లోక్‌అదాలత్‌ సీనియర్‌ సభ్యుడు తులసీదాస్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని